ఇప్పుడు లాక్ డౌన్ లో తీవ్రంగా నష్టపోయిన వారిలో సెలూన్ షాపుల వాళ్ళు కూడా భారీగా ఉన్నారు. వారు అందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఏం చెయ్యాలో అర్ధం కాక షాపుల యజమానులు అందరూ కూడా నానా అవస్థలు పడుతున్నారు. రోజు రోజుకి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారుతుంది. ఆర్ధిక ఇబ్బందులు పెరగడం షాప్ రెంట్ లు పెరగడం వంటివి వారికి పెను సవాల్ గా మారాయి. 

 

ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని హైదరాబాద్ లో డిమాండ్ చేస్తున్నారు. తమకు ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర  ప్రభుత్వాన్ని కోరుతున్నామని హైదరాబాద్‌లోని సెలూన్ కార్మికులు అంటున్నారు. ఒక కార్మికుడు మాట్లాడుతూ... ఒకరికి వినియోగించి మరొకరికి వినియోగించలేని కవర్లు అలాగే శానిటైజర్లు మరియు ఇతర వస్తువులను కొనడం మా ఖర్చులను పెంచిందని వాపోయాడు. అలాగే, జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కొద్దిమంది వినియోగదారులు మాత్రమే వస్తున్నారన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: