దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఆరోగ్య శాఖ వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం గత 24 గంటలలో దేశంలో కొత్త‌గా 19,906 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఇదే స‌మ‌యంలో 410 మంది మృతిచెందారు.  దేశంలో ప్ర‌స్తుతం కరోనా రోగుల సంఖ్య 5,28,859కు చేరుకుంది. ఈ అంటువ్యాధి కారణంగా ఇప్పటివరకు 16,095 మంది మృతిచెందారు. చికిత్స అనంత‌రం 3,09,713 మంది కోలుకున్నారు. రాజధానిలో కరోనా రోగుల సంఖ్య 80 వేల 188కు పెరిగింది. ఇక్క‌డ‌ మొత్తం మృతుల‌ సంఖ్య 2,558కి చేరుకుంది.  గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ లో బీభత్సం సృస్టిస్తుంది. 

 

ఇక  ఢిల్లీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.  నిత్యం ప్రజాప్రతినిధులు, నాయకులతో కళకళలాడే దేశ రాజధాని ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. కరోనా మహమ్మారి అక్కడ భారీగా విస్తరిస్తుండడంతో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. 

 

నేడు కొత్తగా 2889 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతేకాకుండా 65 మంది మరణించినట్లు పేర్కొంది.  27847 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 2623 మంది కరోనాతో మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.  మొత్తం పాజిటీవ్‌ కేసుల సంఖ్య 83077కు చేరుకోగా.. వీటిలో 52607 మంది డిశ్చార్జి అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: