నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బావాయిపల్లికి చెందిన ఓ మైనర్ బాలికతో ఆదే గ్రామానికి చెందిన వినోద్​(22) ఏడాదిగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. తీరా గర్భం దాల్చిందని తెలియగానే... బాలికను వదిలించుకోవడం కోసం హత్య చేయడానికి పూనుకున్నాడు.

 

 

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఊరి బయటికి తీసికెళ్లాడు. గొంతు నులిమి హత్య చేసేందుకు యత్నించాడు. అమ్మాయి కేకలు వేయడంతో చుట్టూ ఉన్న స్థానికులు రావడం గమనించి వినోద్​ అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిందంతా బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు యువకుడి ఇంటి ముందు బైఠాయించారు.గ్రామస్థులు కూడా బాలికకు మద్దతుగా నిలిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబసభ్యులు నిరసన విరమించారు. నిందితుడి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రుల పిర్యాదుతో ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: