దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ వల్ల రవాణా వ్యవస్థలో కీలక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. 50% ఆక్యుపెన్సీతో ప్రస్తుతం ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది నష్టాలు వస్తున్నా కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు చార్జీలు పెంచట్లేదు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వెబ్ సైట్ ను తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. 
 
ఈ నెల 30న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బుకింగ్, రద్దు సౌకర్యం ఉండదని ఆర్టీసీ పేర్కొంది. ఆన్ లైన్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఆర్టీసీ బస్సులకు రిజర్వేషన్ టికెట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: