దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. ఈ నెల 7 నుంచి 22 రోజుల పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కరోజు విరామం తరువాత మళ్లీ పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.53కి చేరింది. ఇప్పటివరకు డీజిల్‌పై మొత్తం రూ.10.39, పెట్రోల్‌పై రూ.9.23 పైసలు పెరిగింది. 
 
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండటంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు దేశంలో మొదటిసారిగా జూన్‌ 24న డీజిల్‌ ధరలు పెట్రోల్‌ ధరలను దాటాయి. శనివారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పెంచడంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.38గా, డీజిల్‌ ధర రూ.80.40గా ఉంది. నిన్న పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: