గత రెండు నెల క్రితం లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. దాంతో కేసుల సంఖ్య పెద్దగా కనిపించలేదు. కానీ ఎప్పుడైతే లాక్ డౌన్ సడలించడం మొదలు పెట్టారో.. కేసులు పెరిగిపోతూ వస్తున్నాయి.  తెలంగాణలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ భూతం కట్టలు తెంచుకుని విజృంభిస్తోంది. తాజాగా 3,227 శాంపిల్స్ పరీక్ష చేయగా 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 816 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వాళ్లే. రంగారెడ్డి జిల్లాలో 47, మంచిర్యాల్ జిల్లాలో 33, మేడ్చెల్ జిల్లాలో 29 కొత్త కేసులు వెల్లడయ్యాయి.

 

కరీంనగర్‌లో ఓ ప్రముఖ నేతకు టీఆర్‌ఎస్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  ఇప్పటికే తెలంగాణ లో పలువురు ప్రజా ప్రతినిధులకు వరుసగా కరోనా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. మూడు రోజులుగా సదరు టీఆర్ఎస్ నేత హరితహారంలో పాల్గొన్నారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొందరు సెల్ఫ్ క్వారన్‌టైన్‌లోకి వెళ్లారు. దీంతో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: