రెండు నెలల క్రితం లాక్ డౌన్ ప్రక్రియ చాలా సీరియస్ కొనసాగించారు. దాంతో వలస కార్మికులు ఎక్కడ ఉన్నవారు అక్కడే చిక్కుకు పోయారు. ఇక వారి కష్టాలు వర్ణణాతీతంగా మారిపోవడంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లి పోవొచ్చు అని కేంద్రం ప్రకటించింది. అంతే కాదు శ్రామిక్ రైళ్ల ఏర్పాటు కూడా చేసింది.  ఈ నేపథ్యంలో వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోాయరు. లాక్‌డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఆ తర్వాత ప్రభుత్వాల చొరవతో సొంతూళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు మళ్లీ నగరానికి పోటెత్తుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కర్మాగారాలు, మెట్రో ప్రాజెక్టులు ప్రారంభం కావడంతో ఉపాధి కోసం మళ్లీ మహానగరంలో అడుగుపెడుతున్నారు.

 

స్వగ్రామాలకు వెళ్లిపోయిన వారిలో దాదాపు ఐదున్నర లక్షల మంది మళ్లీ ముంబైలో అడుగుపెట్టినట్టు రైల్వే శాఖ నుంచి అందిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. వీరిలో కార్మికులు, వ్యాపారులు ఉన్నారు. వీరిలో అత్యధికులు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు ఉన్నారు. జూన్‌కు ముందు మహారాష్ట్ర నుంచి 844 రైళ్లలో 18 మంది లక్షల మంది కార్మికులు స్వస్థలాలకు తరలిపోయారు. ఇప్పుడు వారంతా మళ్లీ ముంబై చేరుకుంటున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా ముంబై వచ్చినట్టు వెస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రవీంద్ర భాకర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: