క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు విస్త‌రిస్తూ దూసుకుపోతోంది. మ‌న దేశంలో కేసులు స‌గ‌టున రోజుకు 20 వేలు ట‌చ్ అవుతున్నాయి. మ‌ర‌ణాలు కూడా రోజుకు 500 కు చేరుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఐదు రాష్ట్రాల్లో క‌రోనా తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల‌లో మ‌హారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. ఇక్క‌డ ఇప్పటివరకు 1,64,626 మంది కరోనా బారినపడ్డారు. దేశం మొత్తం మీద 5.5 ల‌క్ష‌ల కేసులు ఉంటే అందులో పావు వంతు కేసులు ఇక్క‌డే న‌మోదు అవుతున్నాయి. మ‌ర‌ణాలు కూడా చాలా ఎక్కువే. మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 7,429 మంది బాధితులు మృతిచెందగా, 86,575 మంది కోలుకున్నారు. మరో 70,622 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

 

దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 83,077కి చేరగా, 2623 మంది మరణించారు. ఇక త‌మిళ‌నాడు మూడో స్థానంలో ఉంది. ఇక్క‌డ 82,275 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1079 మంది మృతిచెందారు. నాలుగో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 31,320 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1808 మంది మరణించారు. 31,320 పాజిటివ్‌ కేసులతో ఉత్తరప్రదేశ్‌ ఐదో స్థానంలో కొనసాగుతుండ‌గా 660 మంది చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: