దేశ రాజధాని ఢిల్లీలో ఒకే నెలలో నాలుగో మారు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ మద్య కరోనాతోనే ఛస్తున్నాం రా బాబో అంటే ఇప్పుడు మిడతలు, భూకంపాలు కూడా రాజధాని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉంటో ఇప్పుడు మూలిగే నక్కమీద వాతపడ్డట్టు మరో కొత్త ముప్పు పొంచి ఉందని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) విడుదల చేసిన నివేదిక ఒకటి నగర వాసులను ఆందోళను గురిచేస్తోంది.  నగరంలోని దాదాపు 90 శాతం భవనాలు భూకంపాలను తట్టుకోలేవని తేల్చి చెప్పింది.  గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వరుసగా భూకంపాలు వస్తున్న విషయం తెలిసిందే. 


ఆయా భవన నిర్మాణాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడు ఇవి తట్టుకోలేవని నివేదిక పేర్కొంది.  నెహ్రూ ప్లేస్‌లో ఉన్న 16 అంతస్తుల మోడీ టవర్, 17 అంతస్తుల ప్రగతిదేవి టవర్, 15 అంతస్తుల అన్సల్ టవర్, 17 అంతస్తుల హేమ్‌కుంట్ టవర్‌ల‌ నిర్మాణాత్మక ఆడిట్ కోసం నోటీసులు ఇచ్చింది. నోటీసు అందుకున్న‌ భవనాల య‌జ‌మానులు‌ 90 రోజుల్లో నిర్మాణాత్మక ఆడిట్ నిర్వహించాలని కోరింది. ఇప్పటి వరకు కరోనాతోనే అంటే ఇప్పుడు భూకంపాల భయం ఢిల్లీ వాసులకు పట్టుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: