నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరోనా  వైరస్ సంక్షోభ సమయంలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ బార్డర్ టాక్స్ ఏడాది కాలం పాటు రద్దు చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా సింగల్ పర్మిషన్ ఇవ్వాలంటూ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్  అసోసియేషన్ ఆర్టీఏ  కార్యాలయం  ఎదుట ఆందోళన చేపట్టింది. 

 

 భారీ సంఖ్యలో ఆర్టీఏ  కార్యాలయానికి చేరుకున్నారు అసోసియేషన్ సభ్యులు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వెంటనే భారీగా మోహరించిన పోలీసులు నిరసనకారులను అక్కడినుంచి తరలించే  ప్రయత్నం చేశారు, తమ డిమాండ్లు నెరవేరే వరకు ధర్నా విరమించేది లేదు అంటూ స్పష్టంచేశారు అసోసియేషన్ సభ్యులు..

మరింత సమాచారం తెలుసుకోండి: