ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల గురించి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో కేసులు పెరుగుతున్నాయని అయితే మరణాల రేటు తక్కువగానే ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ప్రభావం తక్కువగానే ఉందని అన్నారు. కరోనా కట్టడిపై కేంద్రం సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రభావం హైదరాబాద్‌లో ఎక్కువగా ఉందని అన్నారు. 
 
హైదరాబాద్‌లో రేపటినుంచి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రతిపాదన వచ్చిందని... ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ పెడితే ముందులా ఉండదు కాబట్టి అన్ని చర్యలు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా నిబంధనలు అమలు చేస్తామని... రేపటి నుండి పెద్ద మొత్తంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: