టీడీపీ కీలక నేత మాజీ మంత్రి అయిన అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు ఏసీబీ చేతిలోకి వెళ్ళింది. తాజాగా అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ  కోర్టు విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. 

 

 కాగా ప్రస్తుతం ఈఎస్ఐ స్కామ్ లో  ఆరోపణలు ఎదుర్కొని ప్రధాన నిందితుడిగా  అరెస్ట్ అయిన అచ్చన్నాయుడు అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఏసీబీ మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈ రోజు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాల్సి ఉంది, కరోనా కారణంగా కోర్టు వర్క్ సస్పెండ్ కావడంతో విచారణను జూన్ 1కి వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: