బీహార్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో బీహార్ లో 282 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బీహార్ లో ఇప్పటివరకు 9,506 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు రాష్ట్రంలో పలువురు మంత్రులు వైరస్ భారీన పడుతున్నారు. తాజాగా బీహార్ కు చెందిన ఒక మంత్రికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇటీవల ఆయన రాష్ట్ర సచివాలయంలో మీటింగ్ పెట్టారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా.. పలువురు ఈ మహమ్మారితో మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు సైతం కరోనా భారీన పడటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: