దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి మహారాష్ట్రపై విరుచుకుపడుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఆది నుంచి కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. కరోనా కేసుల్లో మహారాష్ట్ర దేశంలో తొలి స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత ముంబై నగరం రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 5.48 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కేవలం మహారాష్ట్రలోనే 1,64,626 మందికి కరోనా సోకింది. ఆ తర్వాత అధికంగా కేసులు తమిళనాట నమోదు అవుతున్నాయి. ఇక్కడి వాణిజ్య నగరం చెన్నైలో కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి.

 

ఒక్క రోజులోనే 3940 కేసులు నమోదైయ్యాయని ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 82,275కి చేరింది. ఇప్పటివరకూ 45,537మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 35,656మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజుతో కరోనాతో 1,079మంది ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: