అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కు ఇరాన్ సర్కార్ షాక్ ఇచ్చింది. తాజాగా ట్రంప్ పై ఇరాన్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది.డ్రోన్‌ దాడి జరిపి ఇరాన్‌ అగ్రశ్రేణి జనరల్‌ ఖాసిం సొలైమనిని అమెరికా దారుణంగా హత్య చేసిందని ఇరాన్ బలంగా విశ్వసిస్తోంది. ఇరాన్‌ ఈ ఘటనలో ట్రంప్ పై కేసు నమోదు చేయాలని బలంగా నమ్ముతోంది. ఇరాన్‌ ఇంటర్‌పోల్‌కు ట్రంప్‌ను అరెస్ట్‌ చేసి తమకు అప్పగించాలని కోరింది. 
 
ఇరాన్‌కు చెందిన ప్రాసిక్యూటర్‌ అధికారికంగా ట్రంప్ కు అరెస్ట్ వారంట్ జారీ చేసినట్లు ధృవీకరించారు. టెహరాన్‌ అణు ఒప్పందం నుంచి ట్రంప్ అమెరికాను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటి నుండి ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. టెహరాన్‌ ప్రాసిక్యూటర్ అలీ అల్కాసిమెహర్ జనవరి మూడో తేదీన బాగ్దాద్‌లో జనరల్ ఖాసిం సొలైమనిని చంపిన ఘటనలో ట్రంప్ తో పాటు ముప్పై మంది వ్యక్తుల ప్రమేయం ఉందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: