దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కోసం భారత్ తో పాటు ఇతర దేశాలు సైతం అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. తాజాగా భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ను ఈ నెల 20 నుంచి మనుషులపై ప్రయోగించనున్నారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కు ఈ మేరకు అనుమతులు వచ్చాయి. హ్యూమన్ క్లీనికల్ ట్రయల్స్ చేయడానికి డీసీజీఐ ద్వారా భారత్ లో ఈ కంపెనీకు అనుమతులు వచ్చాయి. 
 
భారత్ బయోటెక్ ఇప్పటికే కో వ్యాగ్జిన్ పేరుతో వ్యాక్సిన్ తయారు చేసింది. భారత్ బయోటెక్ జినోమ్ వ్యాలీలోని బయోలెవల్ 3 లో కరోనా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయితే మాత్రం భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేయాల్సి వస్తుంది. జులైలో జరిగిన క్లినికల్ ట్రయల్స్ అనంతరం పూర్తిస్థాయి ఫలితాలు తెలియడానికి మూడు నుంచి నెలలు పట్టే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: