ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్  మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉన్న నేపధ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన సమీక్షా సమావేశం జరిపారు స్మగ్లింగ్  పై. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన సొంత తమ్ముడైనా, బంధువైనా స్మగ్లింగ్‌కు పాల్పడితే వదిలిపెట్టవద్దని ఆయన అధికారులకు సూచనలు చేసారు. 

 

టాస్క్‌ఫోర్స్‌లో చిన్నపొరబాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న ఆయన... ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ 2015లో ఏర్పాటైనా అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. గతంలో ఏడాదికి వందకు పైగా కేసులు నమోదవుతుంటే ఇప్పుడు 20 కేసులు కూడా దాటడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకే మండలంలో 10 వేల ఎకరాలు ఆక్రమణకు గురై  30 ఏళ్లయినా అటవీశాఖ అధికారులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: