కరోనా కేసులు అదుపులో ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. అక్కడ కరోనా దాదాపుగా కట్టడిలోనే ఉంది. అమరీందర్ సింగ్ సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో కరోనా కాస్త అదుపులోనే ఉంది అని చెప్పాలి. ఇక  తాజాగా ఆ రాష్ట్ర సిఎం కీలక వ్యాఖ్యలు చేసారు. పంజాబ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించేది లేదని ఆయన స్పష్టం చేసారు. 

 

లాక్‌డౌన్ పొడిగించకున్నా సరే కరోనా ప్రబలకుండా ప్రజలు భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో జులై చివరి నాటికి కొత్తగా 4 కరోనా పరీక్షల కోసం ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. రోజుకు 20వేల మందికి కరోనా పరీక్షలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 5,216 కరోనా కేసులు నమోదు అయినట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: