రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలతో పాటు, ప్రభుత్వం తీసుకొని వస్తున్న పథకాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి జూలై 1 నుంచి 203 కోట్లతో కొనుగోలు చేసిన 104,108 వాహనాలను వీటిని ఆంబులెన్స్ , మొబైల్ క్లినిక్ సేవల గా ఉపయోగిస్తారు అని తెలిపారు. ఇందులో ఆధునీకరణ చేసి వెంటిలేటర్లు, ఇసీజి, ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడే అత్యవసర లైఫ్ సపోర్ట్  వ్యవస్థలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.

 

 

మొట్టమొదటిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ఈ 108 సేవలను ఆధునికరిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని అత్యాధునిక టెక్నాలజీతో రోడ్ల మీదకి తీసుకురాబోతున్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తపనకు కార్యరూపం ఇదే అని విజయసాయి రెడ్డి అన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: