ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న హంకాంగ్​ జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్​ ఆమోదం పలికింది. తమ హక్కులను కాలరాస్తున్నారంటూ హాంకాంగ్​ వాసులు ఉద్యమం చేస్తున్నప్పటికీ చైనా లెక్కచేయలేదు.  ఈ చట్టానికి తాజాగా నేషనల్​ పీపుల్స్​ కాంగ్రెస్​ స్టాండింగ్​ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సౌత్​ చైనా మార్నింగ్​ పోస్ట్ వెల్లడించింది. స్థాయి సంఘంలోని 162 మంది సభ్యులు 15 నిమిషాల్లోనే దీనికి ఆమోదం పలికారు.

 

అయితే ఇంతకు ముందు బిల్లులో రూపొందించిన 10 ఏళ్ల జైలు అనే నిబంధనను జీవిత కాలానికి మార్చిందని సమాచారం. హాంకాంగ్​ను 23 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలకులు చైనాకు అప్పగించిన జులై 1నే ఈ చట్టం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.ఈ వివాదాస్పద చట్టాన్ని నిలిపివేయాలని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్య పార్లమెంట్, జీ-7 దేశాల కూటమి చైనాపై ఒత్తిడి తెచ్చాయి. అయినప్పటికీ వినిపించుకోలేదు చైనా. కాగా, హాంకాంగ్ ప్రజలు తమ స్వేచ్ఛకోసం గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: