హైదరాబాద్ లో ఇప్పుడు కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ విషయంలో ముందు సమర్ధవంతంగానే వ్యవహరించిన హైదరాబాద్ తర్వాత తేలిపోయింది. దేశం మొత్తం పెరిగిన విధంగానే అక్కడ కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సమర్ధవంతంగా వ్యవహరించినా సరే ఫలితం  మాత్రం లేదు అనే చెప్పాలి. తెలంగాణ‌లో ప్ర‌తి రోజు న‌మోదు అవుతోన్న కేసుల్లో ఒక్క హైద‌రాబాద్‌లోనే ఏకంగా 90 శాతం కేసులు న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ మ‌ర‌ణాల్లో కూడా హైద‌రాబాద్‌లోనే ఎక్కువ న‌మోదు అవుతున్నాయి.

 

తెలంగాణ‌లో క‌రోనా స‌గ‌టు జాతీయ స‌గ‌టు కంటే ఎక్కువ ఉండ‌డంతో పాటు ఇక్క‌డ సామాజిక వ్యాప్తి ఏకంగా 122 శాతంగా ఉంది. దీనిని బ‌ట్టి ఇక్క‌డ క‌రోనా ఎంత ప్ర‌మాద క‌ర ప‌రిస్థితుల్లో ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ నుంచి గ్రామాలకు ఎవరు అయినా వెళ్తుంటే చాలు ప్రజలు భయపడుతున్నారు. హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు వెళ్తున్న  యువకుల విషయంలో వెంటనే పోలీసులకు నిన్నా మొన్నా భారీగా ఫిర్యాదులు వెళ్తున్నాయి. వాళ్లకు కరోనా పరిక్షలు చేసి క్వారంటైన్ లో ఉంచాలి అని పలు గ్రామాలు కోరుతున్నాయి. గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు పెరగడమే దీనికి కారణమని అక్కడి అధికారులు, ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: