భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి  చైనా సరిహద్దుల్లో తన ప్రతాపం చూపించడంతో భారత్ కూడా ఇప్పుడు చైనాను కట్టడి చేయడానికి అన్ని విధాలుగా సిద్దమైంది.  ఈ విష‌యంలో మోడీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్ టైంలో లా దూకుడుగా కాకుండా మొత‌క వైఖ‌రితో ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో మెదీ చైనా విష‌యంలో ఉపేక్షించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే చైనాకు చెందిన 59 యాప్‌ల‌ను మ‌న‌దేశంలో నిషేధిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

 

ఇక ఇప్పుడు సరిహద్దుల్లో భారీగా యుద్ద విమానాలతో పాటుగా 30 వేల మంది సైనికులను తరలించే ఆలోచనలో కేంద్రం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. సరిహద్దుల్లో చైనాను కట్టడి చెయ్యాలి అంటే ఇప్పుడు సైనిక శక్తిని ఆయుధ శక్తిని ప్రదర్శించాలి అని భావిస్తుంది భారత్. మోడీ కూడా ఇటీవల మన సైనిక శక్తి ప్రపంచం చూసింది అని వ్యాఖ్యలు చేసారు. ఇక ఇప్పుడు చైనా విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాలి అంటే మాత్రం సరిహద్దులకు బలగాలను తరలించాలి అని కేంద్రం భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: