కేంద్ర ప్రభుత్వం నిన్న 59 చైనా యాప్ లపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాజ్ఞలు ఎప్పటినుంచి అమలులోకి వస్తాయో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా టిక్ టాక్ పై వేటు పడింది. టిక్ టాక్ తో పాటు చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేష‌న్ల వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌కే ముప్పు ఉంద‌ని హెచ్చ‌రికలు జారీ చేసిన కేంద్రం వెంటనే టిక్ టాక్ తో సహా 59 యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. 
 
ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి కూడా 59 యాప్ లు తాజాగా తొలగించబడ్డాయి. ఇకనుంచి కొత్త యోజర్లు యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడం వీలు కాదు. ఈ నెల 15వ తేదీన గల్వాన్ లోయ ఘటన చోటు చేసుకోవడంతో అప్పటినుంచి చైనా యాప్ లను నిషేధించాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపించాయి. తాజాగా కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: