కేంద్ర ప్రభుత్వం నిన్న టిక్ టాక్ సహా 59 యాప్ లపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ల నుంచి తొలగించబడ్డాయి. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్ ఇతర యాప్ లను భారత్ బ్యాన్ చేయడంపై తాజాగా చైనా స్పందించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ భారత్ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
 
యాప్‌లపై నిషేధం భారత్‌కు మేలు చేసేది కాదని ఆయన అన్నారు. చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి పని చేయాలని తమ ప్రభుత్వం చైనా వ్యాపారవేత్తలకు నిరంతరం చెబుతూ ఉంటుందని అన్నారు. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో భారత్ 59 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించింది. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి భారత సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: