ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 18,114 శాంపిళ్లను పరీక్షించగా మరో 704 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 648 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 12,202 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 14,595 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 6,770 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,245  మంది డిశ్చార్జ్ అయ్యారు.

 

ఇక మృతుల సంఖ్య 187 కి చేరింది. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసాని అరకిలోమీటర్ దూరంలో.. హోటల్ యజమానికి కరోనా. అదే హోటల్ లో ప్రముఖ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు వచ్చిపోతుంటారని సమాచారం.  నాలుగు రోజుల క్రితం కరోనా లక్షణాలతో హూటల్ మూసి వేసిన హోటల్ యజమాని.  నిన్న పరీక్షలు చేయగా నేడు కరోనా పాజిటీవ్ అని తేలింది. ఆ హూటల్ కి వచ్చిన తిన్నవారిని గుర్తించే పనిలో అధికారులు.  ఇక సీఎం నివాసం చుట్టు పక్కల శానిటైజేషన్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: