తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా తెరాస ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెరాస ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వం అంటూ విమర్శించారు. మొన్న కాలేశ్వరం అంతకుముందు మిడ్మానేరు మల్లన్న సాగర్ నేడు కొండపోచమ్మ కాలువకు గండి.. ఇలా తెలంగాణ సర్కార్ ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ నాణ్యతలేని  ప్రాజెక్టులు కట్టడం వలన సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకును వెళ్లదీస్తున్నారు అని విమర్శలు చేశారు. 

 


 సీఎం సొంత నియోజకవర్గంలోని పరిస్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు, తెరాస సర్కారు కమిషన్  కోసమే స్కీములు పెట్టింది అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెరాస ఒక లీకేజీ ప్రభుత్వ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: