విద్యార్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. రేపటి నుంచి ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి పరీక్షల వాయిదా గురించి ప్రకటన వెలువడింది. 
 
దీంతో రాష్ట్రంలో జరగాల్సిన ఎంసెట్, పాలిసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గత కొన్ని రోజుల నుంచి ప్రవేశ పరీక్షల నిర్వహణ గురించి తెలంగాణ సర్కార్ స్పష్టత ఇవ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: