ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జాతినుద్దేశించి మరోసారి ప్రసంగిస్తున్నారు. మోదీ మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో అన్ లాక్ 2.0లో ప్రవేశిస్తున్నామని చెప్పారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కరోనా కట్టడిలో మెరుగ్గానే ఉందని చెప్పారు. లాక్ డౌన్ దేశంలో చాలా మంది ప్రాణాలను కాపాడిందని అన్నారు. సరైన సమయంలో లాక్ డౌన్ విధించి ప్రాణ నష్టాన్ని తగ్గించామని చెప్పారు. 
 
కేసులు పెరుగుతున్న సమయంలో నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. పబ్లిక్ ప్లేస్ లో మాస్క్ పెట్టుకోలేదని ఒక దేశంలో దేశ ప్రధానికే ఫైన్ వేశారని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచనలు చేశారు. సర్పంచ్ నుంచి ప్రధాని ఎవరూ నియమాలకు అతీతులు కాదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: