గత మూడు నెలల క్రితం దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కనీ వినీ రీతిలో ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.  అత్యవసర వస్తులకు మాత్రమే బయటకు రావాలని.. ఒకవేళ అలా వస్తే వారికి బడిత పూజ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో జనసమూహాలు ఉండే అన్ని వ్యవస్థలు మూసి వేశారు. అందులో రవాణా వ్యవస్థ ఒకటి.. రోడ్డు పై పరిమిషన్ ఉన్న వాహనాలు తప్ప ఇతర వాహనాలు నడపలేదు. ఏది ఏమైనా రోడ్డు పై వాహనాల రాకపోకలు తగ్గడంతో ప్రమాదాల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది.

 

కానీ ఈ మద్య లాక్ డౌన్ సడలించారు. దాంతో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి.. ఇంకేముంది ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని నిడమానూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సునీల్​ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. విశాఖవైపు వెళుతున్న ట్యాంకర్ లారీని... ద్విచక్రవాహనం వెనకనుంచి ఢీకొట్టడంతో సునీల్​ చనిపోగా.. వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: