దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. కరోనా కట్టడికి తీసుకునే చర్యలు కూడా ఏ మాత్రం ఫలించడం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు కరోనా కట్టడిలో చాలా కీలకంగా భావించే కరోనా పరిక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. 3 లక్షల టెస్ట్ లు ప్రతీ రోజు చేస్తామని ఐసిఎంఆర్ ప్రకటన చేసింది. 

 

కాని అది సాధ్యం అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ప్రతీ రోజు కూడా 2 లక్షల 20 వేలకు మించి కరోనా పరిక్షలు చేయడం అనేది సాధ్యం కావడం లేదు.  మొన్న అయితే కేవలం లక్షా 70 వేల పరీక్షలను మాత్రమే రాష్ట్రాలు చేసాయి. దీనితో అది సాధ్యమా అంటూ  ప్రశ్నలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: