హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు   పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.  తెలంగాణాలో కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్ లో కరోనా కేసులు పెరిగితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. 

 

ఇక ఇప్పుడు గనుక లాక్ డౌన్ లేదు అంటే మాత్రం కరోనా వైరస్ ని ఆపడం అనేది ఎవరికి సాధ్యం అయ్యే పని కాదు అనేది అందరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు లాక్ డౌన్ ని చాలా పక్కాగా అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. డ్రోన్ లను కూడా వినియోగించే ఆలోచనలో ఉన్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ మేరకు డీజీపీ నుంచిసూచనలు కూడా వెళ్ళాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: