హైదరాబాద్ లో లాక్ డౌన్ ఈ నెల మూడు నుంచి అమలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. లాక్ డౌన్ ని మూడో తారీఖు నుంచి అమలు చేయడానికి గానూ రేపు దాదాపుగా జరగబోయే కేబినేట్ భేటీ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్న వెంటనే అమలు చెయ్యాల్సిన వ్యూహాన్ని కూడా సిద్దం చేసినట్టు తెలుస్తుంది. 

 

హైదరాబాద్ లో లాక్ డౌన్ కి సంబంధించి ఇప్పటికే పోలీసులకు సూచనలు వెళ్ళాయి. ఎల్లుండు నుంచి లాక్ డౌన్ ని అమలు చేస్తే... ఆర్టీసీ బస్సులను కూడా నగరం లోకి రానీయకుండా ఏయే మార్గాల్లో నడపాలి అనే  దాని మీద కూడా రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: