ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆస్పత్రుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటుంది. నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఏపీలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తుంది ఏపీ సర్కార్. దీనిపై సిఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. పేద ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూస్తుంది. సిబ్బంది కొరత అనేది లేకుండా చర్యలు చేపడుతూ పేద వాడికి ఆరోగ్యం అందించే ప్రయత్నాలు చేస్తుంది. 

 

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. “ప్రభుత్వ ఆస్పత్రులకు అదనపు బలం చేకూరుస్తున్న జగన్ గారి ప్రభుత్వం. ఒకే నోటిఫికేషన్ ద్వారా దాదాపు 10వేల  వైద్యపోస్టుల భర్తీ. గత ప్రభుత్వాలు నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యమయ్యాయి. ఇకపై 24 గంటలూ పూర్తి స్టాఫ్ తో పనిచేస్తాయ్. అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: