నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామాకు అక్కడి సొంత పాలక పక్షం నేతలే డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క చైనా నేపాల్ భూభాగాన్ని ఆక్రమిస్తుంటే  ప్రధాని మౌనంగా ఉండటంపై నేపాల్ లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.   చైనాను వదిలేసి భారత్ తో సరిహద్దు తగాదాలు పెంచుకోవడం ఏంటీ అని, మిత్ర దేశంగా భారత్ ఉందని అలాంటి దేశంతో  తగువులు ఎందుకు అని ప్రధాని రాజీనామా చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. 

 

ప్రధాని రాజీనామా చేయకపోతే నిరసనలు చేస్తామని  సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్న నేపధ్యంలో నేడు ప్రధాని అత్యవసర కేబినేట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆయన రాజీనామా  నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.  ఈ కేబినేట్ సమావేశానికి కొందరు మంత్రులు దూరంగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: