ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్నది.  ఈ వైరస్ వలన ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన ఈ మాయదారి మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది.  అయితే కరోనా వల్ల బాగా ఎఫెక్ట్ అయిన దేశం అమెరికా.  ఇక్కడ ప్రపంచంలో ఉన్న కేసులు, మరణాల్లో మూడో వంతు నమోదు అయ్యింది.  అప్పటి నుంచి చైనాపై అమెరికా కారాలు మిర్యాలు నూరుతుంది. ఇదే సమయంలో భారత్ పై చైనా చేసిన దాడిపై కూడా ఖండించింది.

 

తాజాగా  హాంకాంగ్​కు రక్షణ ఉత్పత్తులను నిలిపివేస్తామన్న అమెరికా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది చైనా. తాము కూడా అగ్రరాజ్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హాంకాంగ్ జాతీయ భద్రత చట్టం చైనా అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్​ లిజియాన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: