ప్ర‌పంచ అగ్ర‌దేశం అమెరికా క‌రోనా దెబ్బ‌కు చిగురు టాకులా వ‌ణికిపోతోంది. అక్క‌డ ప్ర‌తి సెక‌నుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రోజుకు ఏకంగా 40 వేల కేసులు న‌మోదు అవుతున్నాయంటేనే అమెరికాలో ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌పంచ పెద్ద‌న్న‌గా ఉన్న అమెరికా ఇప్పుడు క‌రోనాలో కూడా నెంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఉంది. అక్క‌డ ప్ర‌జ‌ల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయి. ఇక గ‌త మూడు నెల‌లుగా బ‌య‌ట‌కు రాని అమెరికా ప్ర‌జ‌లు ఇప్పుడు లాక్ డౌన్ రూల్స్ భేఖాతార్ చేసేస్తున్నారు.

 

స్వేచ్ఛా జీవులు కావ‌డంతో ఇష్ట‌మొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అక్క‌డ రోజుకు ల‌క్ష కేసులు న‌మోదు అవుతాయ‌ని ఆందోళ‌నలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాగే 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ఆశిస్తున్నానన్నారు.  కాగా 2.6 మిలియన్లకు పైగా  కేసులు,  లక్షా 26 వేల మరణాలతో ప్రపంచంలోనే అత్యంత కరోనా ప్రభావిత దేశంగా అమెరికా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: