గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంకాలజీ విభాగం ప్రారంభించిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ మాట్లాడారు. మరో ఏడాదిలో కర్నూలులో కూడా కేన్సర్ విభాగ౦ ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఏపీ వైద్య రంగంలో ఇదో సువర్ణ అధ్యాయం అని ఆయన చెప్పుకొచ్చారు. తొలిసారి గా ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొస్తున్నామని అన్నారు. 

 

రోగుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకొస్తున్నామని సిఎం అన్నారు. ప్రతీ గ్రామంలో 5 నుంచి 7 గ్రామాలకు ఒక డాక్టర్ ని నియమిస్తామని చెప్పారు. చిన్నారుల కోసం జిల్లాకు రెండు చొప్పున నియోనాటల్ అంబులెన్స్ లను ప్రారంభించామని సిఎం అన్నారు. ఉదయం కొత్త 1088 అంబులెన్స్ లను ప్రారంభించామని అన్నారు. 104 అంబులెన్స్ ల ద్వారా వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: