ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి  విజృంభణ కొనసాగుతున్నది.  అమెరికా నుంచి ఆస్ట్రేలియా వ‌ర‌కు ఇండియా ఇలా ఏ దేశంలో చూసినా క‌రోనా విజృంభ‌ణ‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా కేసులు విప‌రీతంగా పెరిగి పోతున్నాయి. ఇక ఇప్ప‌టికే క్రీడ‌ల‌కు పాకిన క‌రోనా దెబ్బ‌తో ఎన్నో క్రికెట్ టోర్న‌మెంట్లు కూడా ర‌ద్ద‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఐపీఎల్ ర‌ద్ద‌య్యింది. టీ -20 ప్ర‌పంచ క‌ప్ కూడా ర‌ద్ద‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ప‌లు దేశాల మ‌ధ్య సీరిస్‌లు కూడా ర‌ద్ద‌వుతున్నాయి.

 

ఈ క్ర‌మంలోనే కరోనా కారణంతో ఆస్ట్రేలియా, జింబాబ్వే   మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌ కూడా వాయిదా పడింది. మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.  ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం  ఆగస్టులో ఆతిథ్య  ఆస్ట్రేలియాతో  జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి  ఉంది. క‌రోనా త‌గ్గాక మ‌రోసారి రెండు దేశాల బోర్డులు స‌మావేశ‌మై తేదీలను ప్రకటిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇన్‌ఛార్జి సీఈవో  నిక్‌ హాక్లీ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: