దేశంలో ఫిబ్రవరిలో కరోనా కేసులు మొదలైన విషయం తెలిసిందే. ఇక మార్చిలో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. అప్పటి నుంచి మద్యం, రవానా,విద్యా వ్యవస్థలు మొత్తం మూతపడ్డాయి.  ఇక మద్యం దొరక్క మందుబాబుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  దాంతొ కొంత మంది పిచ్చివారయ్యారు.. ఉన్మాదులుగా మారారు.  మద్యం మత్తు కోసం కొంత మంది రసాయినాలు కూడా సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. 

 

మద్యానికి బానిసైన వ్యక్తి మత్తు కోసం శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన కడపలో జరిగింది. కడప రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్న పురుషోత్తం కరెంట్ పనులు చేస్తుంటాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల మద్యం ధరలు భారీగా పెరగటంతో అతను కొనలేకపోయాడు. దాంతో మంగళవారం మత్తు కోసం శానిటైజర్ తాగాడు.  అస్వస్థతకు గురైన అతన్ని రిమ్స్​కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: