రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ సహా చైనా యాప్ లపై బ్యాన్ విధిస్తూ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో టిక్ టాక్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ భారత్ లోని టిక్ టాక్ ఉద్యోగుల భద్రతకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. భారతీయ చట్టాలకింద డేటా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి అంశాలకు తామెంతో ప్రాధాన్యమిస్తున్నామని ఆయన అన్నారు. 
 
మా ఉద్యోగులే మాకు బలం.. మీ క్షేమాన్నే మేం కోరుతున్నాం అని కెవిన్ తాజాగా ఉద్యోగులకు రాసిన లేఖలో లేఖలో పేర్కొన్నారు. భారత్ లోని తమ సంస్థ ఉద్యోగుల భద్రతపై వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని.... డిజిటల్ ఇండియాలో మేం క్రియాశీలకమైన, చురుకైన పాత్ర పోషిస్తున్నామని ఆయన అన్నారు. పరోక్షంగా ప్రభుత్వం ఈ బ్యాన్ ని సడలించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: