మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 4,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడి ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. రోజు వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆస్పత్రులన్నీ ఫుల్‌ అయ్యాయి. తాజాగా  ముంబైలో మళ్లీ 144 సెక్షన్‌ విధించారు. ఈరోజు నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు ముంబై పోలీస్‌ కమిషనర్‌ ప్రణయ అశోక్‌ తెలిపారు.

 

ఈ నేపథ్యంలో బహిరంగ, మతపరమైన ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదని చెప్పారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో కరోనా కేసుల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: