ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న పల్లె వెలుగు పథకం కింద రాష్ట్రంలోని 2 వేల ఆవాస గ్రామాల్లో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పథకాల్లో తక్కువగా లబ్ధి పొందుతున్న గ్రామాలను జగనన్న పల్లె వెలుగు పథకం కింద రాష్ట్రంలోని 2 వేల ఆవాస గ్రామాల్లో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 
 
ఫిర్యాదుల మానిటరింగ్‌ వ్యవస్థను ప్రభుత్వం ఇందుకోసం అందుబాటులోకి తీసుకురానుంది. వెలగని వీధి దీపాలను విలేజ్‌ సెక్రటరీలు ఎప్పటికప్పుడు ఈ సీఎంఎస్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను అనుసరించి పరిష్కరించనున్నారు. ఈ పథకం ద్వారా అభివృద్ధి జరగని గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: