తెలంగాణ ప్రభుత్వం పై  మరోసారి తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా  వైరస్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజా ఆరోగ్య వైద్య డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం అంటూ తెలిపిన  హైకోర్టు... ఐసీఎమ్ఆర్ నిబంధనలకు విరుద్ధంగా పిహెచ్ డాక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని అభిప్రాయా పడింది. 

 

రాష్ట్రంలో  కరోనా  వ్యాధి పరీక్షలు మీడియా బులిటెన్  ద్వార అరకొర  సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం  పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కన్సైన్మెంట్ విధానమేంటో తెలపాలంటూ ఆదేశించింది హైకోర్టు. గత 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు కూడా తెలపాలని ఆదేశించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: