పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నేడు వైయస్ నిర్మాణ్ పేరుతో ఒక యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో సిమెంట్ సరఫరా కోసం ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. ఈరోజు మంగళగిరిలోని ఏపీఐఐసీ పార్కులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూతన పారిశ్రామిక పాలసీని సిద్దం చేసి సీఎం జగన్‌కు అందజేశామని.... సీఎం జగన్‌ చెప్పినట్లుగా గొప్ప పాలసీని రూపొందించామని అన్నారు. 
 
పరిశ్రమలకు పారదర్శకంగా రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని.... ఎక్కువ ఉపాధి ఇచ్చే పరిశ్రమలకు మంచి రాయితీలు అందిస్తామని చెప్పారు. వైఎస్సార్‌ నిర్మాణ్‌ యాప్‌ ద్వారా సిమెంట్‌ను నిర్మాణ సంస్థలకు అందుబాటులోకి తెస్తామని... సకాలంలో సిమెంట్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సిమెంట్ అందుబాటు ధరలో ఉండేలా చూస్తామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: