చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. బి.కొత్తకోటలో ఒక మహిళా వాలంటీర్ ఆత్మహత్యా యత్నం చేసుకోవడం సంచలనంగా మారింది. మహిళా వాలంటీర్ సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. ఇళ్ళ పట్టాల విషయంలో తలెత్తిన వివాదమే దీనికి కారణమని తెలుస్తుంది. లబ్దిదారులకు ఇళ్లపట్టాల మంజూరులో రెవెన్యూ అధికారులు సహకరించడంలేదని ఆమె అసహనం వ్యక్తం చేసింది. 

 

ఈ ఆరోపణలు చేస్తూ ఆమె తహసీల్దార్ కార్యాలయం భవనంపై ఎక్కి కిందకు దూకడంతో అక్కడ అందరూ షాక్ అయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఉన్న వారు వెంటనే స్పందించి ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆమెను పెద్ద ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాలి అని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: