భారత్ తో సంబంధాల విషయంలో... నేపాల్ పాలక పక్షం కూడా ప్రధాని కేపీ ఒలి పై ఆగ్రహంగా ఉన్న తరుణంలో ఆయనకు గుండె పోటు వచ్చింది. తనకు గుండెపోటు వచ్చింది అని ఆయన చెప్పడంతో వెంటనే వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆయనను రాజధాని నగరం ఖాట్మండులోని సాహిద్ గంగలాల్ నేషనల్ హార్ట్ సెంటర్‌కు తీసుకెళ్లారు. 

 

అక్కడ ఆయనకు పలు పరిక్షలు చేసిన తర్వాత ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదు అని వైద్యులు సూచించి ఇంటికి పంపించారని ప్రధాని ప్రెస్ అడ్వైజర్ సూర్య థాపా మీడియాకు వివరించారు. కాగా ఆయన రాజీనామా చెయ్యాలి అంటూ అక్కడ పాలక పక్షం గత రెండు రోజులుగా ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తుంది. చైనాకు సహకరిస్తున్నారని మండిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: