ఈ మద్య జంతువుల నుంచి పంటలను రక్షించడానికి విద్యుత్ తీగలు, బాంబులు అమర్చుతున్నారు. అయితే వాటి వల్ల కొన్ని మూగజీవాలు బలి అవుతున్నాయి. ఇటీవల కేరళాలో ఇలా జంతువుల భారి నుంచి పంటపొలాలు రక్షించేందుకు బాంబు పెట్టగా దాన్ని ఏనుగు తినడంతో చనిపోయింది. ఇలా ఎన్నో జంతువులు మృత్యువాత పడ్డాయి. అయితే పంటపొలాలను రక్షించేందుకు అమర్చే విద్యుత్ తీగల వల్ల మనుషులు కూడా చనిపోతుంటారు. తాజాగా మామిడి తోటలో పందులు రాకుండా అమర్చిన విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతిచెందాడు. చిత్తూరు జిల్లా కన్నికాపురంలో వెంకటేశ్ అనే రైతుకు మామిడితోట ఉంది.

 

అందులోకి పందులు రాకుండా ఉండేందుకు చుట్టూ విద్యుత్ తీగలు అమర్చారు.  గ్రామ సమీపంలో ఉన్న గ్రానైట్ కర్మాగారంలో పనిచేసే ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు కాయల కోసం తోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టింది. ఈ ఘటనలో జోగేంద్ర నాయక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మున్నా బెహరా అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతనిని పోలీసులు వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: