తెలంగాణా బిజెపి నేతలు, వర్సెస్ అధికార తెరాస పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతూనే ఉంది. బిజెపి నేతలు ఇప్పుడు తెరాస ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

కరోనా బాధితుల కోసం 7వేల 150 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినా కరోనా రోగులను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.  కేంద్రం నిధులు ఇవ్వకపోతే శ్వేతపత్రం ఇవ్వండని ఆయన సవాల్ చేసారు.  సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చిన నిధులు ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఉందా అంటూ నిలదీశారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: