దేశంలో అన్ లాక్ మొదలయింది అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మాత్రం ఆ పరిస్థితి కనపడటం లేదు. ముంబైలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. దీనితో ముంబైలో 144 సెక్షన్ విధించింది అక్కడి సర్కార్. బహిరంగ ప్రదేశాల్లో ఒకరు, లేదా అంతకంటే ఎక్కువ మంది కనిపిస్తే వారి కదలికపై నిఘా ఉంటుందని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది పోలీసు శాఖ. 

 

అదే విధంగా అత్యవసర, నిత్యావసర వస్తువులు, మెడికల్ ఎమర్జెన్సీ సరఫరాలు మినహా ఏదీ కూడా కంటైన్‌మెంట్ జోన్లలో ఉండటానికి వీలు లేదని, అక్కడ డ్రోన్ లతో పర్యవేక్షణ ఉంటుంది అని స్పష్టం చేసింది. ముంబైలో మాత్రం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుంది అని స్పష్టం చేసింది  పోలీసు శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: