తండ్రీకొడుకులు పోలీసు కస్టడీలో చనిపోయిన ఘటన తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తూత్తుకుడికి చెందిన మొబైల్ షాపు ఓనర్లు అయిన పీ జయరాజ్‌, జే బెనిక్స్‌లను లాక్‌డౌన్ నిబంధన ఉల్లంఘించి షాపు తెరిచారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే లాకప్ లో ఉన్నవాళ్లు రెండు రోజుల వ్యవధిలో మృతి చెందారు. వీరి మృతిపై స్థానికులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టటంతో పాటు పోలీసులే హత్య చేశారంటూ ఆరోపణలు చేశారు. 
 
మద్రాస్ హైకోర్టులో ఈ ఘటన గురించి పిటిషన్లు దాఖలయ్యాయి. కేసును విచారించిన హైకోర్టు... ఈ కేసును సీబీఐ స్వీకరించేంత వరకు సీఐడీకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ ఘటనపై సూపర్ స్టార్ స్పందిస్తూ కొందరు పోలీసులు ప్రవర్తించిన తీరు తనకు ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: